ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలో ప్రజా ప్రతినిధి అధికారులతో కలిసి వరంగల్ సమగ్ర అభివృద్ధిపై సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. శనివారం సాయంత్రం హనుమకొండ కలెక్టరేట్ వరంగల్ నగర అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రింగ్ రోడ్డు భూసేకరణ అంశం వేగవంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ వ్యాయం అంచనాల పెంపుపై సమగ్రమంగ చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఎందుకు అంచనాలు పెంచాల్సి వచ్చిందనే అంశంపై కులంకషంగా చర్చించి అధికారుల నుంచి రిపోర్ట్ తీసుకుంటామని పేర్కొన్నారు. నాలాల అక్రమణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం తదితర అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తామని వెల్లడించారు. సూపర్ స్పెషాలిటీ పనులు మరింత వేగవంతంగా చేపట్టేలా అధికారులు చల్లలు తీసుకోన ఆదేశించారు. వెంటనే వైద్య సేవలు ప్రజలకు అందు బాటులకు తెచ్చేలా కృషి చేయాలని సూచించారు. త్వరలో నిర్వహించే సమావేశంలో అన్ని చర్చించి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. 


సీఎం ఆదేశాలను పాటిస్తాం..

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి 

వరంగల్ నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనలను పాటిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో నిర్వహించిన ప్రతి అంశాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు ముందుకు సాగుతామని తెలిపారు. వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, దీనిపై సమగ్ర సర్వే నిర్వహిస్తామని చెప్పారు. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. అంచనాల పెంపుపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మమునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పనులను త్వరగా చేపడతామని పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో చర్చించిన అన్ని అంశాలను పరిష్కారంచే దిశగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. 


స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలి 

ఎమ్మెల్యే కడియం శ్రీహరి 


వరంగల్ అభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ముఖ్యమంత్రిని కోరారు. కడియం శ్రీహరి సమీక్ష సమావేశంలో పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రింగ్ రోడ్డు నిర్మాణంతోపాటు, జాతీయ రహదారుల అనుసంధానం అది ఎలా సాధ్యమవుతుంది అన్ని వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ 2050 డీటెయిల్ రిపోర్టు తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. వరంగల్ కు ప్రాచీనంగా ఎంతో పేరు ఉందని నగరాన్ని హెల్త్ సిటీగా, ఏకో టూరిజం సిటీగా మార్చేందుకు తగిన ప్రణాళికలు రూపొందించా లని ముఖ్యమంత్రి తీసుకువచ్చారు. ఓకే వరంగల్ నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి ఇన్చార్జి మంత్రి ప్రజాప్రతినిధులు అందరూ సహకరించాలని కోరారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: