TG: మేడ్చల్ జిల్లాలో విషాదం నెలకొంది. చెట్టుకు ఉరేసుకుని యువకుడు సంతోష్ (25) ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గౌడవెల్లిలో భార్యతో కలిసి నివాసం ఉంటున్న సంతోష్.. నిన్న భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. తీవ్ర మనస్తాపం చెందిన సంతోష్.. స్మశాన వాటికలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Post A Comment: