ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
భారత ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాలలో జరిగే ఎన్నికల షెడ్యూల్ ను సోమవారం విడుదల చేశారని, ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమ వాళి వెంటనే అమల్లోకి వచ్చింది అని హనుమకొండ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి సిక్తా పట్నాయక్ తెలిపారు.
సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ మహేందర్ జీ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూకేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుందని జిల్లా కలెక్టర్ చెప్పారు. నవంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ నవంబర్ 10 వ తేదీ అని 13న స్క్రూట్నీ నిర్వహించనున్నారు అని అన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15. నవంబర్ 30వ తేదీన ఎన్నికలు నిర్వహించి, డిసెంబర్ 3న కౌంటింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
నవంబర్ 3,2023 తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారని, పదో తేదీ వరకు నామినేషన్ వేసుకోవచ్చు అని, 13వ తారీఖున దాఖలైన నామినేషన్లను పరిశీలిస్తారని, 15వ తారీఖున ఉపసంహరణ, నవంబర్ 30వ తేదీన ఎన్నికలు నిర్వహించబడతాయని, 3 డిసెంబర్ రోజున కౌంటింగ్ ప్రక్రియ చేపడతారన్నారు.
హనుమకొండ జిల్లాలో రెండు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లలో పరకాల లో 239 పోలింగ్ స్టేషన్లో, వరంగల్ పశ్చిమ 244 మొత్తం టోటల్ పోలింగ్ స్టేషన్ లు 483 ఉన్నాయన్నారు. ఇందులో పరకాల లో 45, ఆత్మకూరులో 32, దామెర 24, నడికుడ 31,గీసుకొండ (వరంగల్ డిస్ట్రిక్ట్) 52, సంఘం వరంగల్ డిస్ట్రిక్ట్ 44, కిల వరంగల్ 11 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు, వరంగల్ పశ్చిమ పరిధిలో హనంకొండ మండల పరిధిలో 178, కాజీపేట మండల పరిధిలో 53, వరంగల్( పార్టీలి) వరంగల్ డిస్టిక్ పరిధిలో 13, మొత్తం 244 ఉన్నాయన్నారు. మొత్తం జనరల్ ఓటర్లు 494179, అదేవిధంగా ఎన్నారై ఓటర్లు 86, సర్వీస్ ఓటర్లు 221 ఉన్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు 23 మంది డిస్టిక్ నోడల్ ఆఫీసర్లను , 57 సెక్టర్ ఆఫీసర్లను, డిస్టిక్ ఇంటెలిజెన్సీ కమిటీ పరిధిలో 12 మంది జిల్లా స్థాయి అధికారులు అపాయింట్ చేసినట్టు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో 12 మంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్టర్ టీమ్స్, 18 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, 18 స్టాటిస్టిక్స్ సర్వేలెన్సీ టీమ్స్, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ( ఎం సి ఎం సి) కమిటీలను ఏర్పాటు చేశామని,6 సభ్యులతో కూడిన మీడియా మానిటరింగ్ ఇందులో ప్రధానంగా పెయిడ్ న్యూస్ చెకింగ్, వెరిఫైయింగ్ అడ్వర్టైజ్మెంట్స్ పరిశీలిస్తారన్నారు.అదేవిధంగా ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశామన్నారు డిస్టిక్ కో-ఆపరేటివ్ ఆఫీసర్, హనుమకొండ మీడియా సెంటర్ జిల్లా పౌర సంబంధాల అధికారి ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టుల తో కూడిన కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నియమా నిబంధనలు ఈరోజు నుండే అమల్లోకి వచ్చాయన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఎన్నికల నియమ నిబంధనల గురించి విస్తృత ప్రచారం చేయుటకు ఇంప్లిమెంటేషన్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఇందులో మూడు కమిటీలను 24 గంటలు, 48 గంటలు, 72 గంటల్లో చేపట్టాల్సిన విధానాలు ముఖ్యంగా 24 గంటల్లో బ్యానర్స్ 48 గంటల్లో పబ్లిక్ ప్రాపర్టీ, 72 గంటల్లో ప్రైవేట్ ప్రాపర్టీ లో ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ లను పరిశీలించడం జరుగుతుందన్నారు. హెల్ప్ లైన్ కోసం 1950 ఏర్పాటు చేశామన్నారు. క్రిటికల్ పోలీస్ స్టేషన్లో 55 ఉన్నట్లు పోలీసులు ఇంటెలిజెన్సీ వారి ఆధారంగా నిర్ధారించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం 50 వేల వరకు రసీదుతో తీసుకుపోవచ్చు అని 10 లక్షలు వరకు మానిటరింగ్ ఉంటుందని కొన్నారు, పోలింగ్ కోసం పిడబ్ల్యుడి పోలింగ్ స్టేషన్లో యూత్ పోలీస్ స్టేషన్లు, ఉమెన్ పోలింగ్ స్టేషనులను మూడు కేటగిరీలుగా ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. మొత్తానికి ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.


Post A Comment: