ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

ప్రభుత్వ ప్రాధాన్యత లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.

మంగళవారం  జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎంపీడీవోలు ఎమ్మార్వోలు పంచాయతీరాజ్ ఈఈలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సిఎస్ శాంతి కుమారి సూచించిన విధంగా ఐటీడీఏ ద్వారా పోడు భూముల పట్టా పంపిణీ కార్యక్రమాన్ని సత్వరం పూర్తి చేయాలని జిల్లాలో ఎరువులు విత్తనాలు కొరత రాకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని దారిలో నూతన పట్టాదారుల బ్యాంకు వివరాలు సేకరించి అప్డేట్ చేయాలని అన్నారు. అలాగే ప్రతి నెల లక్ష్యాలను నిర్దేశించుకుని సాధించాలని, ప్రభుత్వం గుర్తించిన భూమి పట్టాలను అర్హులైన ఎంపిక చేసి పంపిణీ చేయాలని, తెలంగాణకు హరితహారం లో భాగంగా గ్రామాల వారిగా మొక్కలు నాటేందుకు అవసరమైన మేర ఉపాధి హామీ పథకం కింద ఫిట్టింగ్ పనులు పూర్తి చేయాలని మొక్కలు సంరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి అవెన్యూ ప్లాంటేషన్ మొక్కకు టీ గార్డ్ ఏర్పాటు చేయాలని నాటిన ప్రతి మొక్క లెక్క పక్కాగా ఉండేందుకు జియో ట్యాగింగ్ చేయాలన్నారు. బీసీ కుల వృత్తుల వారికి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా లక్ష ఆర్థిక సహాయం కింద వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల ఎంపిక పారదర్శకంగా ఆన్లైన్ చేయాలని, బీసీ వృత్తులు దరఖాస్తుల పరిశీలన అర్హుల ఎంపిక ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావాలన్నారు. అలాగే ప్రతి గ్రామ పంచాయతీలోని వైకుంఠధామాలలో కరెంట్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని కరెంటు సౌకర్యం అనుకూలంగా లేనిచోట సోలార్ తో కరెంటు సౌకర్యం కల్పించాలని అన్నారు. గ్రామాలలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి సమస్య పరిష్కరించుకోవాలని పనులు మాత్రం ఆగకుండా చూడాలని వచ్చే సోమవారం నాటికి పూర్తి స్థాయిలో ప్రగతి సాధించాలని అన్నారు. ప్రతి మండలంలో అనుకున్న దానికంటే తక్కువ స్థాయిలో ప్రగతి పనులు నడుస్తున్నాయని సంబంధిత ఎంపీడీవోలు తాసిల్దార్ లో పంచాయతీరాజ్ ఈ ఈ లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని అలాగే మిషన్ భగీరథ ద్వారా మండలంలోని గ్రామాలలో ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీరు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నందున ప్రతి గ్రామంలో మంచినీటి బోరు వేయించడానికి సంబంధిత ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.

 ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంధ్యా  రాణి, డిఎఫ్ఓ  వసంత పీడీ డిఆర్డిఏ శ్రీనివాస్ కుమార్ డిపిఓ  జగదీశ్  తదితరులు పాల్గొన్నారు.. 

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: