మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని, ఇతర చట్టబద్ధహక్కులు, సౌకర్యాలు కల్పించాలనీ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు తోకల రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జులై 6 నుండి జరుగు గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికుల నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలనిపిలుపునిస్తున్నాము.గ్రామపంచా తెలంగాణ రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న సుమారు 50 వేల మంది గ్రామపంచాయతీ కార్మికులకు వారి శ్రమకు తగ్గ ఫలితం అందడం లేదని, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద భీమా లాంటి చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు కూడా అమలు కావడం లేదని అన్నారు. శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని, చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు కల్పించాలని రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి జేఏసీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యదర్శుల నుండి పంచాయతీరాజ్ కమిషనర్ దాకా వినతి పత్రాలు ఇచ్చి, ఆందోళనలు నిర్వహించి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి తెలియజేసినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం వలన తప్పనిసరి పరిస్థితులలో జులై 6 నుండి గ్రామపంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మెకు పోవాల్సి వస్తుందని అన్నారు. ఈ సమ్మెలో గ్రామపంచాయతీ కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు తమ మద్దతుని తెలియజేసి సహకరించాలని కోరారు. పిఆర్సీ నివేదిక ప్రకారం బేసిక్ వేతనం 19000 రూపాయలు చెల్లించాలని, అప్పటివరకు జీవో నెంబర్ 60 ప్రకారం స్వీపర్లకు 15,600 రూపాయలు మిగతా సిబ్బందికి 19,500 రూపాయలు చెల్లించాలని, గ్రామపంచాయతీ కార్మికుల వేతనాల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, ట్రెజరరీ ల ద్వారా వేతనాలు చెల్లించాలని, పీఎఫ్, ఇఎస్ఐ, సౌకర్యాలు కల్పించాలని, జీవో నెంబర్ 51 సవరించి, మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, పాత కేటగిరిలన్నిటిని యధావిధిగా కొనసాగించాలని, కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని విధి నిర్వహణలో ప్రమాదం జరిగి మరణించిన సిబ్బంది కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని, ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలి, సహజ మరణానికి ఇన్సూరెన్స్ పథకాన్ని ఐదు లక్షలకు పెంచాలి, వయస్సు మీరిందనే సాకుతో కార్మికులను మార్చితే ఆ కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ గా 5 లక్షలు ఇవ్వాలని తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: