మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

బీఎస్పీ పార్టీ రామగుండం ‌నియోజకవర్గ ఇంచార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో రామగుండం ప్రెస్ క్లబ్ లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోలివాడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ  శనివారం 8 వ తారీఖు ఉదయం 11 గంటలకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు, సీయం అభ్యర్థి, డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ రామగుండం, స్థానిక ఎన్టీపీసీ లోని టి.వి. గార్డెన్స్ కు వస్తున్నారని, పార్టీ సీనియర్ నాయకులు దేవునూరి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఇతర పార్టీల నుండి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు బీఎస్పీ పార్టీ లో చేరబోతున్నారని, వారందరికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్‌.ప్రవీణ్ కుమార్ పార్టీ కండువాలు కప్పి బీఎస్పీ పార్టీ లోకి ఆహ్వానిస్తారని,  అన్నారు. ఆర్.ఎస్‌.ప్రవీణ్ కుమార్ ద్వార రాష్ట్ర రాజకీయాలను మార్చే ప్రకటన  ఈ రామగుండం నుంచే  వెలువడ పోతుందని,  ఈ సభ అనంతరం రామగుండం పేరు రాష్ట్రంలోనే ప్రత్యేకతను సంతరించుకుంటుందని, ఇకనుండి బి.ఏస్.పి. భవిష్యత్తు ఊహించనంత ఎత్తుకు ఎదుగుతుందని, బహుజన వాదంతో ముందుకు పోతున్న బి.ఏస్.పి. తో రామగుండంలో అగ్రవర్ణ పార్టీలకు అప్పుడే  గుబులు పుడుతుందని, రాబోయే ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు,  ఈ సభకు బీఎస్పీ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కూడా వస్తున్నారని అన్నారు. ఈ‌ కార్యక్రమానికి బీఎస్పీ నాయకులు, అభిమానులు, అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఎస్పీ సీనియర్ నాయకులు కాసిపేట లక్ష్మీనారాయణ,  జనగామ మల్లేష్, కల్వల సాయి దీపక్, తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: