పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:జూలై:2:22:ప్రజలకి సేవ చేస్తానని అధికారంలోకి వచ్చి ప్రజలకి చేసింది శూన్యం వెయ్యి ఇస్తరు..కోట్లు కొట్టెస్తరు జాగ్రత్త...ప్రజల సమస్యలు పరిష్కరించని నాయకున్ని బహిష్కరించండఅని పిలుపునిచ్చారు,ఇంతకు ముందు ప్రజలకి సేవ చేస్తానని అధికారంలోకి వచ్చి ప్రజలకి చేసింది శూన్యమని,ఓట్లప్పుడు వచ్చి వెయ్యి ఇస్తరు.. గెలిచిన తర్వాత కోట్లు కొట్టెస్తరు జాగ్రత్త.. అని బీజేపీ నేత కౌశిక హరి అన్నారు.రామగుండంలో తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన
బీజేపీ నేత కౌశిక హరి ఆత్మీయ సమావేశంలో భాగంగా వివిధ గ్రామాల మండలాల నుండి,రామగుండం కార్పొరేషన్,8వ ఇంక్లైన్ కాలనీ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు,అభిమానులు తరలివచ్చిన సమావేశంలో కౌశిక హరి మాట్లాడారు,చాలా ఏళ్ళుగా ఇక్కడ సమస్యల పట్ల కార్మికుల పట్ల,విద్యార్థి,యువకులు,మహిళల సమస్యలపై పోరాడుతున్నానని,స్థానికంగా పుట్టి పెరిగిన వాణ్ణి అని ఈప్రాంతం పట్ల పూర్తి అవగాహన,ఆలోచన,అభిమానం ఉన్న వాన్ని అని,ఎక్కడి నుండో వలస వచ్చిన వాణ్ణో లేదా ఓట్ల కోసం ఐదేళ్లకోసారి వచ్చేవాన్ని కాదని కరవు వచ్చిన.కరోన వచ్చిన ఇక్కడే ఉండి ప్రజలకి సేవ చేస్తానని తనకు అధికారంతో పని లేదని సమస్య ఎక్కడున్న అక్కడ తను ఉంటానని అన్నారు.బిజెపి టిక్కెటు వస్తుందా రాదు అని అందరికీ అపోహ ఉన్నదని అడిగిన ప్రశ్నకు,అధిష్టానం క్లియరెన్స్ ఇచ్చిందని!..టిక్కెట్ వస్తుందని గెలుపు ఖాయమని?.ఆశాభావం వ్యక్తం చేసిన బిజెపి నేత కౌశిక హరి...ఏ నాయకుడు కూడా అధికారంలో ఉండి ప్రజలకి చేసింది శూన్యం అని,ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించడం చేతకాని నాయకులు కూడా ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారని,ఎద్దేవా చేసారు.స్థానికంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిపై పోరాటం చేసే ఆలోచన లేదు కానీ సచ్చిన కాడికి పుట్టిన కాడికి పోయి ఫోటోలు దిగుతూ ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు.ఎన్నికల్లో పోటీ చెయ్యడమే తమ ముఖ్య ఉద్దేశం కాదని,సమస్యలపై పోరాటమే తన ఎజెండా అని అన్నారు.బీజేపీ పార్టీ నుండే పోటీలో ఉంటానని బీజేపీ తన ఇంటి పార్టీ అని గత ముప్పై ఏళ్లుగా నాతో పాటు కష్ట నష్టాల్లో పలు పంచుకుంటూ నాతో పాటె ఉంటున్న కార్యకర్తలకు,అభిమానులకు రుణపడి ఉంటానని,భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి,కార్యకర్తలకు మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మహవాది రామన్న,నిమ్మరాజుల రవి,మూకిరి రాజు,మారం వెంకటేష్,పున్నం శశికుమార్,తోడేటి రవికుమార్,గాలేంకి ప్రసాద్,నిమ్మరాజుల రవి,కుక్క గంగా ప్రసాద్,జమిల్ భాయ్,మేకల శ్రీనివాస్,దారంగుల కుమార్,మద్దికుంట శంకర్,గోగుల రవీందర్ రెడ్డి,గడపురం కళ్యాణ్,బత్తిని సతీష్,కమలాకర్ రెడ్డి,స్వర్ణకారుల సంఘం రాజు,గౌరయ్య ట్రాక్టర్స్ డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గౌరయ్య,కమలాకర్ రెడ్డి,జెన్కో ఉద్యోగుల సంఘం నాయకులు గుర్రం నరసింహులు,శాడవేని రాజు,నిమ్మకాయల రవి తదితరులు,పాల్గొన్నారు


Post A Comment: