చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
కేంద్రంలో బిజెపి ప్రవేశపెట్టిన పథకాలపై బిజెపి ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలకు అవగాహన కల్పించాలని కర్ణాటక ఎగ్జిక్యూటివ్ మెంబర్ చైతన్య అన్నారు.
చౌటుప్పల్ మున్సిపాల్ కేంద్రం 11వ వార్డు పరిధిలోని 30, 32, 33, 39బూతులలో బిజెపి
మహాజన సంపర్కంలో భాగంగా మేర భూత్ సబ్సే మజ్బుద్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. మున్సిపల్ కేంద్రం 9, 10, 11వార్డులలో సుమారు 50 మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లా
డుతూ బిజెపి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో సైతం బిజెపి బలంగా మారిందన్నారు. కేంద్రంలో బిజెపి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇన్చార్జి మున్సిపల్ బిజెపి ఫోర్ లీడర్ కౌన్సిలర్
పోలోజు శ్రీధర్ బాబు, పార్టీ నాయకులు గోశిక పురుషోత్తం, గోశిక ధనుంజయ, గోశిక భావ నాఋషి, నోముల రఘునాథ్, జెల్ల నారాయణ, పోలోజు వెంకటాచారి, గోశిక భాస్కర్, గోశిక చంద్రయ్య, బడుగు ప్రభాకర్, చింతకింది హరీష్ గౌడ్, సంపత్, పాలకూర సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: