వాస్తవ తెలంగాణ న్యూస్ టేక్మాల్ ప్రతినిధి పవన్
మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టెక్మాల్ మండల పరిధిలోని కాధ్లుర్ గ్రామంలో సర్వాయిపాపన్న మోకు దెబ్బ గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గ్రామ కమిటీ అధ్యక్షులు వేల్పుగొండ అంజ గౌడ్. ఉపాధ్యక్షులు ముస్లాగారి అంజా గౌడ్. ప్రధాన కార్యదర్శి వెల్పుగొండ.రామకృష్ణ గౌడ్. కోశాధికారి ముస్లాగారి. రవి గౌడ్. సహాయ కార్యదర్శి వెల్పుగొండ. శ్రీనివాస్ గౌడ్. వీరిని గ్రామ గౌడ సంఘం పెద్దలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
గ్రామ అధ్యక్షులు అంజ గౌడ్. మాట్లాడుతూ గౌడ జాతి హక్కుల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు గౌడ జాతి పరిరక్షణ కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని తెలిపారు ప్రభుత్వం ద్వారా అందించే పథకాలను గౌడన్నలకు అందించే విధంగా కలసికట్టుగా ఉండాలని అన్నారు అలాగే నన్ను గ్రామ కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు అందరికీ రుణపడి ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘం కుల పెద్దలు పాల్గొన్నారు

Post A Comment: