ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హన్మకొండ నుండి పుణ్య శైవక్షేత్రం అరుణాచలం బస్సు సర్వీసు ను వరంగల్ ఆర్ ఎం శ్రీ లత శనివారం రాత్రి ప్రారంభించారు.గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం రాత్రి పది గంటలకు అరుణాచల క్షేత్రం చేరుకుంటుందని రాత్రి భక్తులు గిరి ప్రదక్షిణ చేసి సోమవారం ఉదయం అరుణాచల శివుని దర్శనం చేసుకోవాలి అని సూచించారు. వెళ్లే సమయంలో కాణిపాకం విఘ్నేశ్వరాలయ దర్శనం చేసుకోవాలన్నారు. తిరుగు ప్రయాణం లో వెల్లూరు లో గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం బయలుదేరి మంగళవారం ఉదయం హన్మకొండ చేరుకుంటారని తెలిపారు. అరుణాచలం బస్సు సర్వీసు ప్రారంభించడం ఆనందం గా ఉందన్నారు. ప్రయాణీకులు సహకరించాలని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు.


Post A Comment: