మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి: గంగారపు వెంకటేష్ 

తెలంగాణ ఉద్యమ కళాకారుడు, ప్రముఖ గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ అకాల మృతి పట్ల తెలంగాణ సాంస్కృతిక సారథి (టి.ఎస్.ఎస్.), రామగుండం అధ్వర్యంలో సాయి చందుకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, ఘనంగా నివాళులు అర్పించారు. శనివారం గోదావరిఖనిలోని స్థానిక ప్రధాన చౌరస్తాలో గల టీ.బి.జి.కే.ఎస్. కార్యాలయంలో తెలంగాణ సాంస్కృతిక సారథి (టి.ఎస్.ఎస్.), రామగుండం కళాకారుల అధ్వర్యంలో దయ నర్సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంతాపసభలో, పలువురు కళాకారులు తమ స్వర గానాలతో సాయిచందుకు ఘనంగా నివాళులు అర్పించి, ప్రగాఢ సంతాపం ప్రకటించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ సాయిచంద్ ఉద్యమ కళాకారుడే కాక మంచి గాయకుడని, తెలంగాణ ఉద్యమ సమయంలో తన గానంతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఉర్రూతలూగించిన కళాకారుడు సాయి చందు అని, ప్రజలను చైతన్య పరుస్తూ తెలంగాణ సాధనలో పాలుపంచుకున్నారని, ప్రజా ఉద్యమ వారసుడిగా తండ్రిని మించిన తనయుడిగా, మంచి గాయకుడే కాదు, గొప్ప ఉద్యమ నాయకుడని, అన్ని వర్గాల ప్రజలకు స్నేహశీలి అని, తను భౌతికంగా లేకున్నా తెలంగాణ ప్రజలందరిలో చిరస్థాయిగా అమరుడై నిలిచాడని అన్నారు. గానస్పూర్తితో నడిచినోడు, మారుమ్రోగిన కంఠనాదం మూగబోయినాదట, మల్లి రాడట చూసి వద్దామా, మన సాయి చందును, మల్లెపూల దండలేద్దామా మా సాయిచందు కు... అంటూ నివాళులు అర్పించారు. చౌరస్తాలో గల అమరవీరుల స్తూపం వద్దకు కొవ్వొత్తుల ర్యాలీతో అమరుడు సాయి చందు కి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాసర్ల మల్లేష్, జనగామ రాజన్న, గంగారపు వెంకన్న, మల్లోజుల విజయానంద్, మాదాసు రామ్మూర్తి, తోడేటి శంకర్ గౌడ్, బతుకుల రాజన్న, ఈదునూరి పద్మ, ప్రజానాట్యమండలి స్వామన్న, చీకటి అంజన్న, కళాకారులు దారంగుల రాజేశ్వరి, మర్రి ఐలయ్య, కొండ్ర సునీత, రేవల్లి సంగీత, కామెర పద్మ, తదితరులు పాల్గొని సాయిచందు పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: