ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ :
వరంగల్ లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దివ్యాంగుల పట్ల దాతృత్వంతో వ్యవహరించారు. తన నియోజకవర్గ పరిధిలో ఇద్దరు దివ్యాంగులకు వీల్ చైర్లను సోమవారం తన క్యాంపు కార్యాలయం వద్ద అందజేశారు. కాళ్లు కదపలేని స్థితిలో ఉండి నడవడమే ఏమాత్రం సాధ్యం కాని ఎల్బీనగర్, దేశాయిపేట రోడ్డులోని మహ్మద్ ఖాజా మొయిన్ అక్తర్, వేణురావు కాలనీలోని మడూరి రఘురామ్ కు వీల్ చైర్లను కుటుంబ సభ్యుల సమక్షంలో అందజేశారు. దీంతో దివ్యాంగులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తమకు కదలడానికి వీలుగా కోరిన వెంటనే వీల్ చైర్లను అందించి ఎంతో దాతృత్వాన్ని ప్రదర్శించిన ఎమ్మెల్యేకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ టి.రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: