ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ లో గురుపౌర్ణమి పర్వదినం సందర్భంగా సోమవారం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నగరంలోని వివిధ సాయిబాబా ఆలయాల్లో జలాభిషేకాలు, క్షీరాభిషేకాలు, పుష్పాభిషేకాలు, కలశాలతో ప్రత్యేకంగా జరిపారు. అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ ఉత్సవాలు సాయంత్రం వరకు అలంకరణ, అన్నదానం, పల్లకీ సేవ, ఊరేగింపు తదితర రూపాల్లో బ్రహ్మాండంగా కొనసాగాయి.
కృష్ణ కాలనీలో..
కృష్ణ కాలనీలోని సాయిబాబా మందిరంలో ఉదయం జరిగిన గురుపౌర్ణమి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కృష్ణ కాలనీ సాయిబాబా భజన మండలి, కోదండరామ నిలయంలో దోమకుంట్ల వెంకటరమణ తదితరులతో కలిసి అభిషేకం జరిపారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ అభిషేక మహోత్సవంలో 27వ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్, జెడ్ఆర్ యూసీసీ మెంబర్ చింతాకుల సునీల్, డివిజన్ బీఆర్ ఎస్ అధ్యక్షుడు, యాకూబ్, టి.రమేష్ బాబు, స్థానికులు బ్రిజ్ గోపాల్ లాహోటీ, గణేష్, సత్యం తదితర కాలనీవాసులు పాల్గొన్నారు.
దేశాయిపేటలో..
వరంగల్ దేశాయిపేటలోని శ్రీసాయిబాబా దేవాలయంలో పూజా మహోత్సవాలు జరిగాయి. ఇందులో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అభిషేకంలో పాల్గొన్నారు. దాదాపు 3వేల కలశాలతో పాలాభిషేక ఉత్సవం కన్నులపండువగా జరిగింది. భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో బాబా పూజల్లో భాగస్వాములయ్యారు. కార్యక్రమంలో శంకరయ్య, 12వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవితరాజు యాదవ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సదానందం, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సోల రాజు(గణపతి), సోల రవి, వెంకటేశ్వర్లు, మార్గం నాగరాజు, ఇట్టబోయిన రవి, కొత్త నగేష్, సాగర్ గౌడ్, చింతం మధుసూదన్, వనపర్తి శ్రీనివాస్, రంగనాథ ఆలయ చైర్మన్ ఎన్.నారాయణ తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: