ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
నెహ్రు యువ కేంద్ర వరంగల్ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సౌజన్యంతో వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, అజాధికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ వడ్డేపల్లి పింగిలి ప్రభుత్వ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ డిపార్ట్మెంట్ నుండి పది స్టాల్స్ ఎక్స్పో నిర్వహించడం జరిగింది ఇందులో జిల్లాకు సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్స్ మరియు పింగిలి కాలేజ్ స్టూడెంట్స్ తయారు చేసిన నూతన టెక్నాలజీకి సంబంధించిన వంటివి డిస్ప్లే ఉంచడం జరిగింది. ఈ స్టాల్స్ ను మన పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పింగిలి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రమౌళి అధ్యక్షత వహించగ ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ పార్లమెంటు సభ్యులు పసునూరు దయాకర్ విచ్చేసి మాట్లాడుతూ యువత పైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని యువత లేకుంటే నవతలేదని నవత లేకుంటే నాగరికత లేదని యువత మన భారత దేశ ఔన్నత్వాన్ని కాపాడే గొప్ప వనరు అని చెప్పారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమం కళాకారులకు వారి ప్రతిభ వెలుకి తీయడానికి ఒక గొప్ప వేదిక అని ఈ అవకాశాన్ని యువత ఉపయోగించుకోవాలని కోరారు. తాను కూడా ఒక కళాకారుడి నేనని తన కళే నన్ను ఈ ఎంపీ స్థానంలో నిలబెట్టిందని అదేవిధంగా కళాకారులు కూడా తమ ప్రతిభకు పదును పెట్టి ఉన్నత స్థానంలో నిలవాలని కోరారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ
భారతదేశానికి స్వాతంత్ర సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని, ఆదర్షాలను, విలువలను వ్యాప్తి చేయడానికి, విభిన్న సంస్కృతుల మధ్య ఐక్యతను సాధించేందుకు కృషి చేయాలని తెలియజేశారు. జిల్లాస్థాయిలో సాంస్కృతిక, వకృత్వ, పెయింటింగ్, పద్య రచన మరియు మొబైల్ ఫోటోగ్రఫీ అనే 5 రకాల పోటీలు నిర్వహించినట్లు నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి చింతల అన్వేష్ తెల తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఈసమ్ నారాయణ మాట్లాడుతూ విద్యతోపాటు విద్యార్థులు తమ సాంస్కృతిక నైపుణ్యాలను వెలికి తీయాలని అప్పుడే సంపూర్ణ మానవునిగా ఎదుగుతారని తెలియజేశారు. ఈ పోటీలు హనుమకొండలోని వడ్డేపల్లిలో ప్రభుత్వ పింగిలి మహిళా కళాశాలలో ఈ రోజున సమయము ఉదయం 9 గంటల నుండి ప్రారంభమయ్యాయి. ఉపన్యాస మరియు నృత్య ప్రదర్శన, యంగ్ రైటర్స్ కాంటెస్ట్, యంగ్ పెయింటింగ్ ఆర్టిస్ట్ కంటెస్ట్ మరియు మొబైల్ ఫోటోగ్రఫీ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ హరిప్రసాద్, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్, ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డిస్టిక్ ప్రాజెక్టు మేనేజర్ స్వప్న మాధురి, పింగీలి కళాశాల వైస్ ప్రిన్సిపల్ సుభాషిణి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు రాధిక , రాజేశ్వరి, మంగమ్మ ప్రోగ్రాం ఆర్గనైజర్ జక్కి శ్రీకాంత్, జాతీయ యువజన అవార్డు గ్రహీతలు డాక్టర్ అకులపెల్లి మదు, మహమ్మద్ అజాం, వివిధ కళాశాలలో చెందిన విద్యార్థిని విద్యార్థులు 500 మంది వరకు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రదర్శించిన కళాకారుల నాట్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. దూపకుంట కు చెందిన సందీప్ కళాబృందం పాడిన పాడిన పాటలు విశేషకులను బాగా ఆకట్టుకున్నాయి . అనంతరం గెలుపొందిన విజేతలకు అతిధుల చేతుల మీదుగా బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. విజేతలు రాష్ట్రస్థాయిలో జరిగే యువజన వత్సవాల్లో పాల్గొంటారని జిల్లా యువజన అధికారి చింతల అన్వేష్ తెలియజేశారు.

Post A Comment: