ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
తరుగు పేరు మీద రైతులను ఇబ్బందులకు గురి చేయరాదనీ సీపీ ఏవి రంగనాధ్ మిల్లర్ల కు హితవు పలికారు.
కలెక్టరేట్ మీటింగ్ హాల్ నందు బుధవారం నాడు సీపీ ఏవి రంగనాధ్, హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ కలెక్టర్ ప్రవీణ్య, అదనపు కలెక్టర్లు, పోలీస్ అధికారూలతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, క్షేత్ర స్థాయి లో యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలు పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ రైతులు అరుగలం కష్టించి పండించిన పంటల కొద్దీ రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్ట పోయారని , ఇప్పుడు తరుగు పేరు మీద మీద ఇబ్బందులు గురి చేయరాదాని మిల్లర్లను సూచించారు. తరుగు మీద పిర్యాదులు ఎక్కువ గా వస్తున్నాయని,అన్నారు.
ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక మొత్తంలో తరుగు పేరుతో రైస్ మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని తనిఖీ లలో ఇది నిజమే నని తేలింది అని అన్నారు. కొంతమంది మిల్లర్లు అత్యషకు పోయి రైతులను నష్టపరుస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు. టాస్కఫోర్స్ కమిటీ లు నిత్యం తనిఖీ లు చేస్తారని, ఇబ్బంది గురి చేసే మిల్లార్ల పై చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. మరో వైపు రైతులు కూడా ధాన్యం కొనుగోలు లో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని ఈ మేరకు సిబ్బంది సహకరించాలని అన్నారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి ఐయ్యే వరకు సంబందిత అధికారులు సమన్వయం తో పని చేయాలి అని ఆదేశించారు.
హనుమకొండ, వరంగల్, జనగాం అదనపు కలెక్టర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇప్పటి వరకు కొన్న ధాన్యం, రైస్ మిల్లార్లు సెంటర్ ల వివరాలను తెలిపారు.
ఈ సమావేశంలో హనుమకొండ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ వత్స కోట, జనగాం అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డిఆర్డిఏ పిడి శ్రీనివాస్, సివిల్ సప్లై డిఎం మహేందర్, డిసిఎస్ ఓ వసంత లక్ష్మీ, మార్కెటింగ్ అధికారి సురేఖ, మూడు జిల్లాల వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, సివిల్ సప్లై, ఐకేపి పిఏసిఎస్ , ఎఫ్ సిఐ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: