మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందుఅఖిల భారత రైతుకూలీ సంఘం (ఎ ఐ కె యమ్ ఎస్)ధర్నా నిర్వహించారు.అనంతరం జిల్లా జెసికి రైతంగా సమస్యలపై మేమోరాండం ఇవ్వడం జరిగింది. అఖిల భారత రైతు కూలీ సంఘం (ఎ ఐ కె యమ్ ఎస్)రాష్ట్ర నాయకులు వెల్తురు సదానందం, పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు చంద్రయ్య, జిల్లా నాయకులు వెలుపుల సాంబయ్య మాట్లాడుతూ...ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల రైతంగం తీరని నష్టాలకు గురైంది.ప్రభుత్వం తడసిన వరి ధాన్యాన్ని పూర్తి గా కొనుగోలు చెయ్యాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఐకేపీ, కేంద్రాల్లో వరి ధాన్యం నీటి పాలయి పోయింది. సరిపడు టార్పిలిన్ లు లేనీ వలన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా కొనుగోలును వేగవంతం చేయాలి. అకాల వర్షాలవల్ల మార్కెట్ యార్డ్, ఐకేపీ కేంద్రాల్లో సరిపడు టార్పిలిన్లు కేటాయించాలి, నీటమునిగిన వరి, మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలి. వరి ఎకర కు 50000/-వాణిజ్య పంటలకు ఎకరాకు 100000/-చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని అఖిల భారత రైతుకూలీ సంఘం (ఎఐకె. ఎమ్ ఎస్)డిమాండ్ చేస్తుంది.ప్రభుత్వం వ్యవసాయరంగానికి చేయూతనివ్వాలని కోరుతున్నాం.రైతుల శ్రమను కొల్లగొట్టుటకు ప్రయివేట్ మిల్లర్లు చేస్తున్న కుట్రలను ఎ ఐ కె యమ్ ఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. రైతులను మోసం చేస్తున్న మిలర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలి. బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి అన్నారు. ఈ కార్యక్రమంలో AIKMS జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లూరి మల్లేష్, బండిరాంచేందర్, IFTU జిల్లా నాయకులు కాదాసి లింగమూర్తి, అరుణో దయ నాయకులు తిర్రి బాలకృష్ణ, p. సంతోష్, నవీనగౌడ్, రిషి గౌడ్ పాల్గొన్నారు.

Post A Comment: