ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
విధి నిర్వహణలో అకస్మాత్తుగా మరణించిన దివంగత పోలీస్ కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జే సురేందర్ రెడ్డి అన్నారు. మహా దేవ్ పూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఇటీవల గుండెపోటుతో ఏఎస్ఐ చేరాలు మృతి చెందగా, ఆయన సతీమణి సౌందర్యకు గురువారం జిల్లా జిల్లా పోలీస్ కార్యాలయంలో భద్రత పథకంలో భాగంగా మంజూరు అయిన రూ. 7లక్షల 80 వేల చెక్కును ఎస్పి అందించారు. ఈ సందర్భంగా మరణించిన ఏఎస్ఐ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందాల్సిన బకాయిలను త్వరితగతిన అందజేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలనీ, కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన పోలీసు కుటుంబాలకు పోలీసు శాఖ అండగా ఉంటుందని ఎస్పి సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయ ఏఓ అయుబ్ ఖాన్, సీనియర్ అసిస్టెంట్ శివరాo రెడ్డి, సీసీ ఫసి యొద్దిన్, దివంగత ఏఎస్ఐ చేరాలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: