ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
టిఎస్ పిఎస్సీ లీక్ లపై మాట్లాడుతున్న బండి సంజయ్, రేవంత్ రెడ్డి లు దమ్ముంటే, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు నిరూపించాలి.
గాలికి మాట్లాడి, బట్టలు కాల్చి మీద వేయడం కాదు.
గుజరాత్ లో పరువు నష్టం కేసు లో రాహుల్ గాంధీకి రెండేళ్లు శిక్ష విధించి ఆరోపణలు నిరూపించమని అడుగుతున్నారు.
రాహుల్ కి ఒక నీతి, మీకు ఒక నీతి ఉంటుందా?!
మీరు ఆరోపణలు చేయడం కాదు దమ్ముంటే నిరూపించాలి.
కేటీఆర్ వారి టీమ్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నారు.
బండి సంజయ్, రేవంత్ రెడ్డి లు నోటికి వచ్చినట్లు మాట్లాడి, పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు.
తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు.
సరైన సమయంలో సరిగ్గా ప్రతిపక్షాలకు బుద్ది చెప్తారు.
టిఎస్ పిఎస్సీ లీక్ కేసులో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది.
ఎవరు దొంగలో ఎవరు దొరలో దర్యాప్తులో తేలుతుంది.
నిన్నటి తెలంగాణ సీఎం కెసిఆర్ గారు అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలన కార్యక్రమాన్ని అతి తక్కువ సమయంలో ఏర్పాట్లు చేసి విజయవంతం చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు
సీఎం కెసిఆర్ మనసున్న మారాజు అని మరోసారి నిరూపించుకున్నారు
దేశంలో ఇప్పటివరకు ఎక్కడ కూడా నష్టపరిహారం 3,000 రూపాయలు కన్నా ఎక్కువ ఇవ్వలేదు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.5వేలు మాత్రమే ఇచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం మాత్రం పేదల పక్షాన నిలబడింది.
ఎకరానికి నష్టపరిహారం దేశంలో ఎక్కడ లేని విధంగా 10,000 ఇచ్చిన ఘనత సీఎం కెసిఆర్ కే దక్కుతుంది
సీఎం కెసిఆర్ కి తెలంగాణ తెలంగాణ రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాను.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా పంటలకు నష్టపరిహారం ఇస్తున్నారా?!
సమృద్ధిగా నీరు, 24 గంటల కరెంటు, పంటలు పెట్టుబడి, చివరకు పంటలు కొనుగోలు కూడా చేస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా?!
దేశంలో రైతు బీమా ఇస్తున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా?!
నల్ల చట్టాలను రద్దు చేయమని కోరిన రైతులను కాల్చి చంపిన దిక్కుమాలిన ప్రభుత్వం బిజెపిది.
700 మంది రైతులను పొట్టలు పెట్టుకున్న సర్కార్ అది.
తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల పక్షాన పెద్ద రైతుగా నిలబడి ఉన్నారు.
రైతులకు ఏ కష్టాలు వచ్చినా ఆదుకుంటున్నారు.
దేశంలో ప్రజలంతా కేసిఆర్ కోసమే ఎదురుచూస్తున్నారు
అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అంటూ నినదిస్తున్నారు.
బిజెపి కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం ప్రజలు చెబుతారు.

Post A Comment: