మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గణతంత్ర దినోత్సవం అయిన జనవరి 26న జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించే కార్యక్రమాలలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని కూడా పెట్టి ఆయనకు ఘన నివాళులర్పించాలని, *డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మహారాజ్ కోరారు ఈ మేరకు మాట్లాడుతూ దాదాపుగా రెండు శతాబ్దాల పాటు ఆంగ్లేయుల పాలల్లో ఉన్న భారత మాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత 1940 విముక్తి లభించిందని,దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహనీయులు తమ విలువైన ప్రాణాలను త్యాగాలు చేశారన్నారు. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన 1950వ దశకాలంలో దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించిందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు 1950 జనవరి 26న భారత్ అవతరించిందని అదే రిపబ్లిక్ డే, ప్రతి సంవత్సరం జనవరి 26న మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటామం, ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ భీమ్రావు రాంజీ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులుగా, రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి, ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఖిత రాజ్యాంగాన్ని నిర్మించడంలో పెద్దన్న పాత్ర పోషించారని,భారత రాజ్యాంగంలో అంబేద్కర్ అన్ని వర్గాల వారికి సమాన హక్కులు అలాగే ఎస్సీ,ఎస్టీ,బీసీలకు రిజర్వేషన్లు కల్పించి రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో ముందు ఉండేటట్లు అవకాశాలు కల్పించారు. అంబేద్కర్ ని అందరం గౌరవించుకోవడం ఎంతైనా అవసరం ఉన్నది. కావున 26 జనవరి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల స్థలాలలో ఎక్కడైతే భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తామో, అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచి వారిని గౌరవించవలసిందిగా అందర్నీ కోరుకుంటున్నాను. అని సంతోష్ మహారాజ్ పేర్కొన్నారు

Post A Comment: