ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

నీతి నియమాలు, గొప్ప చరిత్ర ఉన్న జాతి గిరిజనుల ది అని, ఈ చరిత్ర, సంస్కృతిని గిరిజనులు కాపాడు కోవాలి అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు  అన్నారు. భాగవతం రాసిన బమ్మెర పోతన, రామాయణం రాసిన  వాల్మీకి, మొదటి తెలుగు కవి పాల్కురికి సోమనాథుడు ఉన్న పాలకుర్తి చరిత్రను ప్రపంచానికి తెలియచేద్దాం అన్నారు.

నేడు పాలకుర్తిలో నిర్వహించిన బంజారా ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ 

అప్పట్లో మా భూములు 1600 ఎకరాలు గిరిజనులే కొన్నారు. మీకు, మాకు చిన్నప్పటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి.

గిరిజనులు నీతిగా ఉంటారు.మాట మీద నిలబడుతారు. పార్టీలకు అతీతంగా గిరిజనులు నా వెంట నిలబడ్డారు.

అందుకే మీకు ఏదో చేయాలని అనుకున్నాను.

సేవాలాల్ మహారాజ్ గుడి కోసం ఇప్పటికే పాలకుర్తి కేంద్రంలో 5 కోట్ల రూపాయల విలువైన భూమి కేటాయించాను.

గుడి నిర్మాణం కోసం ఇప్పటికే కోటి ఇచ్చాను. ఇంకో కోటి గాని ఇస్తా.5 కోట్లు గాని, 10 కోట్లు గాని ఇస్తాను.

ఈ గుడి బ్రహ్మాండంగా ఉండాలి. రాష్ట్రంలో నంబర్ వన్ ఉండాలి.పాలకుర్తి మండలానికి గొప్ప చరిత్ర ఉంది.వల్మిడిలో 10 కోట్లతో  గుడి కట్టాను.రామాయణం రాసింది వాల్మీకి. ఇక్కడే రాశారు.

భాగవతం రాసింది పోతన.ఆయన పుట్టింది ఇక్కడే. ఆయన సాగు చేసిన భూమి ఉందని మాజీ ఐఏఎస్ పాపారావు, ప్రొఫెసర్ పాండు రంగారావు నా దగ్గరకు వచ్చి ఆయన సాగు చేసిన స్థలాన్ని కొనాలి అన్నారు. 

ఆయన సమాధి పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది అన్నారు.

12 ఏళ్ల కింద భూమి కొనడానికి లక్ష రూపాయిలు ఇచ్చాను . 4 ఎకరాలు కొన్నాం. ఆయన కాంస్య విగ్రహాన్ని తయారు చేయిస్తున్నాము.

ఇన్ని రోజులు వీరిని ఎవరైనా పట్టించుకున్నారా? ఈ చరిత్ర పట్టించుకున్నారా?

మొదటి కవి పాల్కురికి సోమనాథుని విగ్రహం 10 కోట్ల రూపాయలతో చేయించాం.వాన కొండయ్య గుట్ట లక్ష్మి నరసింహస్వామి గిరిజనుల ఆరాధ్య దైవం.

2 కోట్ల రూపాయలు పెట్టి రోడ్ వేయించాను.

కోటి రూపాయలతో కల్యాణ మంటపం కట్టిస్తాను.

పాలకుర్తి లో సేవాలాల్ మహారాజ్ గుడి, పిల్లల హాస్టల్ కట్టిస్తాను.

నిర్మాణం నాది. నిర్వహణ మీది.రాష్ట్రంలో ఇది నంబర్ వన్ కావాలి.సేవాలాల్ జయంతి పెద్ద ఎత్తన చేసుకోవాలి. జయంతికి అందరూ ఇక్కడకు రావాలి. ఎస్టీ అంటే చిన్న చూపు కాదు

మీకు గౌరవం ఉంది. చరిత్ర ఉంది. మీ సంస్కృతి గొప్పది.మీ వేషధారణ అద్దాలతో అందంగా ఉంటుంది. 

మీ పండగలు అయినా మీ ఫంక్షన్ల అయినా డ్రెస్ కోడ్ తప్పని సరి అని పెట్టుకోండి.

మీ సంస్కృతిని కాపాడినట్లు అవుతుంది.

నీతి నియమాలు ఉన్న జాతిని కాపాడాలి.

ఈ గుడి చరిత్రలో నిలిచిపోవడమే నా సంకల్పం.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: