ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి 176వ ఆరాధనోత్సవాల సందర్భంగా గత మూడు రోజుల నుండి రాధాకృష్ణ గార్డెన్ లో నిర్వహిస్తున్న ఉత్సవాలను పురస్కరించుకుని నేడు గన్నవరం శ్రీ భువనేశ్వరి, శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీ కమలానందభారతి స్వామితో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వేదపండితులు నడుమ రామ మంత్ర సర్వస్వ యాగంలో నిర్వహించారు.
తదనంతరం
ఆరాధనోత్సవాలలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, కాకతీయ యూనివర్సిటీ వీసీ తాడికొండ రమేష్ తో కలసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శాస్త్రీయ సంగీత నృత్య కార్యక్రమాలను వీక్షించారు.
ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రోత్సయించిన భద్రకాళి ప్రధాన అర్చకులు శేషు అయ్యగారికి మూడు రోజులు నిరంతరం ప్రవేక్షించి విజయవంతం చేస్తున్న త్యాగరాజస్వామి ఉత్సవ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, సంగీత విద్వాంసులు, ప్రజలు, ప్రముఖుకు పెద్దఎత్తున పాల్గొన్నారు.


Post A Comment: