మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ విఠల్ నగర్లో నాయకులు చుక్కల శ్రీనివాస్ ఆద్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కు కొనసాగింపుగా రామగుండం నియోజకవర్గంలోని 13వ డివిజన్ విఠల్ నగర్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరవేసి హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్ర కార్యక్రమంను ప్రారంభించడం జరిగింది...
*ఈ సందర్భంగా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 6 వ తేదీ నుండి హాథ్ సే హాథ్ జోడో అభియాన్ కార్యక్రమం గ్రామగ్రామాన కొనసాగుతుందని తెలిపి డివిజన్లోని ప్రతీ ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను మరియు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురించి ప్రజలకు తెలియచేసి, బీజేపీ, బిఆర్ఎస్ ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక మరియు కార్పొరేట్ అనుకూల విధానాలపై కాంగ్రెస్ పార్టీ విడుదల చేసే చార్జిషీట్ ను ప్రజలందరికీ పంపిణీ చేయడం జరిగింది.

Post A Comment: