ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
సమగ్ర దర్యాప్తుతో నేరస్తులకు శిక్ష పడే విధంగా జిల్లా పోలీసులు పనిచేయాలని జయశంకర్ భూపాలపల్లి ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డిఎస్పీ, సీఐ, ఎస్సై లతో ఎస్పి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
ముందుగా జిల్లాలోని అన్ని పోలీస్టేషన్లలో పెండింగులో ఉన్న కేసుల వివరాలను, యుఐ కేసులను అడిగి తెలుసుకున్నారు. పెండింగులో ఉన్న కేసులను సత్వరమే పరిష్కారానికి కృషి చేయాలని పోలీసు అధికారులను
ఆదేశించారు. అనంతరం
ఎస్పీ మాట్లాడుతూ మహిళల పట్ల జరిగే నేరాలలో పకడ్బదీగా విచారణ చేసి నిందితుల పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కేసుల విచారణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, ప్రతి కేసులో సమగ్ర విచారణ చేపట్టి భాదితులకు న్యాయం చేకూరేలా పని చేయాలని సూచించారు.
అలాగే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని పకడ్బదీగా విచారణ చేపట్టాలని ఎస్పి పేర్కొన్నారు.
ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా కొత్త కొత్త మోసాలకు పాల్పడుతూ అమాయకపు ప్రజల నగదును సునాయాసంగా దోచుకుంటున్నారనీ,
జిల్లా ప్రజలందరికీ సైబర్ నేరాల బారిన పడకుండా నిత్యం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఎస్పి సురేందర్ రెడ్డి సూచించారు.
ఎవరైనా సైబర్ నేరం బారినపడి నగదును కోల్పోతే, వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కు వెంటనే ఫోన్ చేసి సమాచారం అందించే విధంగా అవగాహన కల్పించాలని కోరారు.
పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ నేరస్తులకు శిక్షలు పడేలా ప్రతి ఒక్క పోలీసు అధికారి బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
ఈ నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పి వి. శ్రీనివాసులు, కాటారం, భూపాలపల్లి డిఎస్పీలు ఏ రాములు, జి. రామ్మోహన్ రెడ్డి, వర్టికల్ డిఎస్పి కిషోర్ కుమార్, డీపీఓ సూపరింటెండేoట్ సోఫియా సుల్తానా, ఇన్స్పెక్టర్లు రాజిరెడ్డి, పెద్దన్న కుమార్, వాసుదేవరావు, అజయ్, జితేందర్ రెడ్డి, జానీ నరసిoహులు, కిరణ్, వెంకట్, రంజిత్ రావ్, సతీష్, సంతోష్ పాల్గొన్నారు.


Post A Comment: