ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ;

హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ములుగు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెజోనెన్స్ తెలంగాణ 8వ రాష్ర్ట స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ ను  ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా హన్మకొండ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. క్రీడాకారుల కమిటీ ఉద్యోగుల  కల్పన లోనూ, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పని చేస్తుందన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం అన్ని రంగాల్లో  అభివృద్ధి చెందుతున్న తరుణంలో జాతీయ , అంతర్జాతీయ క్రీడలు ఇక్కడ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి నెలా ఏదో ఒక క్రీడా కార్యక్రమం ఏర్పాటు చేసి, నన్ను ఆహ్వానించి పండుగ వాతావరణంలా జిల్లా యంత్రాంగం అందరూ కలిసి  క్రీడాకారులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నందుకు వారిని అభినందించారు. వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి వారు పరేడ్ చేయగా వారిని పలకరించి పరిచయం చేసుకున్నారు. తన నెలసరి జీతం 1 లక్షా 16 వేల రూపాయలను అథ్లెట్ కీట్స్ కోసం ఇస్తానని అన్నారు. అనేక క్రీడలను ప్రోత్సహించే విధంగా  క్రీడా ప్రాంగణాలను తయారు చేస్తున్న ఘనత కెసిఆర్ కె దక్కుతుందన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి మాట్లాడుతూ వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి క్రీడాకారులను అభినందించారు. గెలుపే  లక్ష్యంగా పనిచేయాలని, ఓటమి తో నిరుత్సహాపడ కూడదని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అజీజ్ ఖాన్ , రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, హనుమకొండ  జిల్లా అధ్లేటిక్ అధ్యక్షుడు  ఎర్రబెల్లి వరదరాజేశ్వర్ రావు, ములుగు జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కుమార్, స్పోర్ట్స్ మీట్ కన్వీనర్ ఐలి చంద్రమోహన్ గౌడ్, వివిధ విభాగాల కోచ్ లు వెంకటేశ్వర రెడ్డి, యుగేందర్ రెడ్డి , పవన్ కుమార్,  కైలాస్ యాదవ్ , రమేశ్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: