ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వయో వృద్ధుల సంరక్షణ సామాజిక బాధ్యతని ఇంచార్జి జిల్లా సంక్షేమ అధికారి కే మధురిమ అన్నారు,
అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రోజున జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా బాలల పరిరక్షణ అధికారి పి సంతోష్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ వయో వృద్ధులు వారి జీవితంలో ఎన్నో సమస్యలను సవాళ్ళను ఎదుర్కొని వారి జీవిత అనుభవాలను ఇతరులకు చెప్పినప్పుడు వారిని అచేతనులు, చాదస్తులు అనే చులకన భావంతో చూడటం విచారకరమని, వారు జీవిత సత్యాలను చెప్పే మేధావులని, అలాంటి వారితో ప్రేమ పూర్వకంగా వ్యవరించాలని, వారి సంరక్షణ విషయంలో మానవీయ కోణంలో బాధ్యతలు నిర్వర్తించాలని అన్నారు.
ప్రపంచమంతా శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి దిశగా పయనిస్తుంటే వృద్ధులు నిర్లక్ష్యానికి గురికావడం, వారిపై నిర్లక్ష్యం అనేది సామాజిక సమస్యగా మారిందని, పిల్లలను ఉన్నత చదువులు చదివించి విదేశాలకు పంపిస్తే వారు అక్కడే స్థిరపడి ఇక్కడ ఉన్న తల్లి తండ్రులను నిర్లక్ష్యం చేయడం బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తంచేశారు,
నిరాదరణకు గురికాబడిన వయో వృద్దులకు మహిళా శిశు దివ్యాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ అండగా ఉన్నదని, తాము ఒంటరి వారిమనే భావన ఉండకూడదని అన్నారు, వారి సంరక్షణ విషయంలో సలహాలు, సూచనలు, సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్లలో సంప్రదించాలని తెలియచేసారు.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కే దామోదర్ మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, చిన్న కుటుంబాలలో సంరక్షణ పోషణ అంశాలను విస్మరించడం, కుటుంబాల మధ్య ప్రేమానురాగాలు లేకపోవడంతో వయో వృద్ధులు కనీస గౌరవానికి దూరమౌతున్నారని, వయో వృద్ధుల సంరక్షణ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు. తల్లి తండ్రులు వయో వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007 తమను తాము పోషించుకొనే స్థితిలో ఉన్నప్పుడు చట్టమే వారి పోషణ ఖర్చులను పిల్లలనుండి ఇప్పించే వెసులుబాటు కల్పిస్తుందని అన్నారు.
సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ బెంచ్ మెంబర్ కే అనితా రెడ్డి మాట్లాడుతూ వయో వృద్దులకు పోషణ సంరక్షణ విషయాలలో సులభమైన వేగవంతమైన న్యాయ సహాయాన్ని అందించేందుకు న్యాయస్థానాలతో సంబంధం లేకుండా తల్లి తండ్రులు మరియు వయో వృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2011 ను రూపొందించిందని అన్నారు,
వయో వృద్ధులను సానుభూతితో కాకుండా సహానుభూతితో చూడాలని వయో వృద్దులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై గ్రామీణ ప్రాంతాలలో విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని అన్నారు, కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దామేర నర్సయ్య, సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు డాక్టర్ చంద్రమౌళి, సిడిపివోలు కే శిరీష, బి భాగ్యలక్ష్మి, స్వరూప, యూడీసిలు వి వెంకట్రామ్, రామచంద్ర మూర్తి, జూనియర్ అసిస్టెంట్
పి రేవంత్,ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ఎఫ్ఆర్వో
కే జయధర్,
సూపర్వైజర్లు అంగన్ వాడి టీచర్లు,
ఆశా కార్యకర్తలు, వయో వృద్ధుల సంక్షేమ సంఘ నాయకులు, వృద్ధాశ్రమ నిర్వాహకులు నరేష్, యాకూబి,సిస్టర్ సోఫియా, ప్రముఖ కళాకారుడు వల్లంపట్ల నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: