ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ నగర పాలక సంస్థ పరిధి లోని 37 వ డివిజన్ ఖిలా వరంగల్ తూర్పు కోట బతుకమ్మ,దసరా ఉత్సవ కమిటి నాయకులు కార్పొరేటర్ బోగి సువర్ణ-సురేష్ ఆధ్వర్యంలో బతుకమ్మ,దసరా ఉత్సవాల గురించి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఖిలా వరంగల్ తూర్పు కోట లో బతుకమ్మ, దసరా ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, తగిన ఏర్పాట్లు చేసేలా అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయాలని వారు ఎమ్మెల్యేను కోరారు. దసరా, బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని, తానూ స్వయంగా భాగస్వామిని అవుతానని ఎమ్మెల్యే వారికి తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సంగరబోయిన విజయ్, ఉత్సవ కమిటీ
నాయకులు వనపర్తి ధర్మరాజు, సంగరబోయిన చందర్, మంద శ్రీధర్ రెడ్డి,సంగరబోయిన ఉమేష్, జెట్టి మురళి తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: