మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సాయితేజ క్రియేషన్స్ నిర్మాణ సారథ్యంలో స్థానిక కళాకారులు దామెర శంకర్ నటించి, నిర్మించి, దర్శకత్వం వహిస్తున్న లఘుచిత్రం 'నాన్న మార్కండేయ కాలనీలో ప్రారంభమయ్యింది. నాయకులు తానిపర్తి గోపాల్ రావు, పిఎస్ అమరేందర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, అమ్మవారి ఉపాసకులు, ఆధ్యాత్మిక గురువు కట్టా సురేష్ భవాని క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు.
ఈసందర్భంగాచిత్రదర్శకులు దామెర శంకర్ మాట్లాడుతూ .. మన జన్మకు కారకుడు, మన అభివృద్ధికి శ్రామికుడు, అహరహము మన భవిష్యత్తుకై కృషిచేసేవాడు నాన్నని, ఆ నాన్న పట్ల అందరూ విధేయత కలిగి, ఆప్యాయతలు పంచుకొని, అన్యోన్యంగా జీవించాలనేదే ఈ లఘుచిత్ర సారాంశమని వివరించగా పలువురు అభినందించారు. ఈ చిత్రంలో దామెర శంకర్ తో పాటు దామెర రాజేష్, అందె సదానందం నటిస్తుండగా, డిఓపి నగునూరి విజయ్, మేకప్ అంజయ్య సమకూరుస్తున్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో కో-ఆఫ్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్, మేజిక్ రాజా,చంద్రపాల్, అమేజింగ్ స్టార్ వేముల అశోక్, చిప్ప రజిత, అఖిల్ జనన్, పెద్దపల్లి రామస్వామి తదితరులు పాల్గూన్నారు.

Post A Comment: