ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ
హనుమకొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రాంపూర్ లోని వీఎమ్ఆర్ పాలిటెక్నిక్ కళాశాల, మడికొండ పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల కళాశాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు ఈ రెండు విద్యాసంస్థల్లో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను కలెక్టర్ పరిశీలించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట హనుమకొండ ఆర్డివో రాథోడ్ రమేష్, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, జడ్పీ సీఈవో రవి, కాజీపేట తహసీల్దార్ భావు సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ హనుమకొండ: సుబేదారిలోని రెడ్ క్రాస్ సొసైటీ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఈవీఎం లను భద్రపరిచే గోదాం భవన నిర్మాణ తుది దశ పనులను త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సోమవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా భవన నిర్మాణ పనులను గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తుది దశకు చేరుకున్న పనులను త్వరగా పూర్తి చేసి అప్పగించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Post A Comment: