వరంగల్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తి ఆస్తి పంపకాల విషయంలో తలెత్తిన వివాదాల కారణంగా తన కన్నతల్లి వినోద(50)పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో వినోదకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టిన సతీష్ ఘటన అనంతరం పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆస్తి పంపకాల వివాదమే ఈ ఘాతుకానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.

Post A Comment: