మేడిగడ్డ టీవీ న్యూస్ ప్రతినిధి మధు

ఆత్మకూరు మండలo లోని గ్రామపంచాయతీ కార్యాలయం నందు ఎఫ్ ఎం ఎం సాంఘిక సేవా సంస్థ వరంగల్ మరియు మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చిల్డ్రన్ ఆఫ్ ఇండియా  ఫౌండేషన్ సహకారంతో గ్రామాఖ్య సంఘ ప్రతినిధులకు, మండల సమాఖ్య ప్రతినిధులకు, స్వయం సహాయక బృందం  మహిళలతో మహిళ సాధికారత, లింగ సమానత్వము మరియు బాలలపై హింసను నిరోధించుట అనే అంశం పైన అవగాహన సదస్సును సంస్థ డైరెక్టర్ *సిస్టర్ సహాయ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది . ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండల ప్రజా పరిషత్ డెవలప్మెంట్ అధికారి ఎం శ్రీనివాసరెడ్డి హాజరైన మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో ఇంకా మహిళల పట్ల అనేక రకాలుగా హింస జరుగుతుందని పిల్లల పైన కూడా వివక్షత ముఖ్యంగ ఆడపిల్లల పైన వివక్షత చూపడం జరుగుతుందని దీనికి అనేక సామాజిక కట్టుబాట్లు, సాంఘిక నియమాలు కూడా వీటికి కారణమయ్యాయి అని తెలిపారు అయితే లింగ సమానత్వం సాధించడం ద్వారా, మహిళలు ఆర్థిక స్వయం సమృద్ధి సాధించడం ద్వారా మహిళా సాధికారత తో పాటు లింగ సమానత్వం పాటించడం ద్వారా  పిల్లల పైన హింస లేకుండా చూడవచ్చని తెలిపారు ఈ సందర్భంగా ఎవరైనా బాల్య వివాహాలు జరిపిన, బాలల అక్రమ రవాణాకు ప్రయత్నం చేసిన, బాలల పైన హింస జరిపిన తక్షణమే పోలీసు 100, చైల్డ్ లైన్ 1098 కు సమాచారం ఇవ్వచ్చని తెలిపారు .ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా రిసోర్స్ పర్సన్ గా హాజరైన ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్లు బత్తుల కరుణ*, ఎర్ర శ్రీకాంత్ మాట్లాడుతూ సాంఘిక కట్టుబాట్లు ,లింగ ఆధారిత మూఢనమ్మకాలు అనేవి మహిళలకు మరియు బాలలకు వారి అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయని వీటిని నిరోధించాలని తెలిపారు అంతేకాకుండా సమాజంలో బాలల సంరక్షణ కొరకు మహిళల సంరక్షణ కొరకు అనేక చట్టాలు ఉన్నాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆన్లైన్లో మహిళల పైన పిల్లల పైన జరుగుతున్న వేధింపులను గుర్తించి తక్షణమే సైబర్ సెల్ పోలీస్ 1930కు రిపోర్ట్ చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో హాజరైన యూత్ *అంబాసిడర్ మధుమతి* మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఉన్న తల్లిదండ్రులు వారి పిల్లల్ని అర్థం చేసుకొని ఈ డిజిటల్ యుగంలో వారు మొబైల్ ఫోన్ ద్వారా చేస్తున్న పనులను పర్యవేక్షించాలని తల్లిదండ్రులు స్నేహపూరితమైన వాతావరణంలో పిల్లల్ని పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి నాగ బండి శివప్రసాద్ ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్లు ఎర్ర శ్రీకాంత్, బత్తుల కరుణ, ఫైనాన్స్ మేనేజర్ M.అజయ్ కుమార్ తదితరులతోపాటు పంచాయతీ కార్యదర్శి.   N  శ్వేత పంచాయతీ ఆఫీసర్ విమల గ్రామైక్య సంఘ ప్రతినిధులు విజయ స్రవంతి, ఉమ తదితరులతోపాటు సుమారు 50 మంది SHG మహిళలు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: