పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పురితోటకు చెందిన సాయికుమార్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తన కుమార్తెను ప్రేమించాడనే కారణంతో అమ్మాయి తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గురువారం రాత్రి సాయికుమార్ తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాడు. ఆ సమయంలో అమ్మాయి తండ్రి గొడ్డలితో అతనిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సాయికుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కూతురును ప్రేమించవద్దని సాయికుమార్ను హెచ్చరించినా వినకపోవడంతోనే ఈ హత్య జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: