జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చింతకుంట్ల రాజనర్సయ్య (58) అనే వ్యక్తి విద్యుత్ షాక్తో దుర్మరణం చెందాడు. శనివారం రాజనర్సయ్య వాగులో చేపల వేటకు వెళ్ళాడు. అయితే, ప్రమాదవశాత్తు వాగులో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, వాగులో విద్యుత్ వైర్లు ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు మృతదేహాన్ని వాగులో నుంచి బయటికి తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో తిప్పన్నపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Post A Comment: