తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. యాత్రకు సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయని, ప్రస్తుతం జిల్లాల పర్యటనలు ప్రారంభించానని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం చివరి వరకు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటానని, వచ్చే ఏడాది పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి, పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందని కేటీఆర్ భావిస్తున్నారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ పట్ల విశ్వాసాన్ని మరింత పెంచడానికి ప్రయత్నిస్తానని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదని ఆయన సూర్యాపేట జిల్లాలో వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని కేటీఆర్ విమర్శించారు.
Post A Comment: