ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ లోని భద్రకాళి అమ్మవారిని కేంద్ర బొగ్గు గనులు, మైన్స్ శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం దర్శనం చేసుకున్నారు. భద్రకాళి అమ్మవారి దర్శనం కోసం వచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఆర్డీవో వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. ఆలయానికి వచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అధికారులు ఘన స్వాగతం పలకగా, పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు కేంద్రమంత్రికి ఆశీర్వచనాలు అందించారు. అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆలయ పూజారులు ఆలయ వస్త్రాలతో ఘనంగా సన్మానించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి శేషు భారతి, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: