ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండలో నిర్మాణంలో ఉన్న కాళోజీ కళాక్షేత్రం పనులలో ఏవైనా అదనపు పనులు ఉంటే వాటిని వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు.
గురువారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఇప్పటివరకు పూర్తయిన పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. కళాక్షేత్రంలో నిర్మాణ పనులకు సంబంధించి పూర్తి చేయడంపై ఆయా శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు పూర్తిచేసుకుని ప్రారంభోత్సవానికి అంతా సిద్ధంగా ఉంచాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, ఇతర శాఖల అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
Post A Comment: