ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య గురువారం రాత్రి బస చేశారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు నెలలో గురుకుల పాఠశాల లేదా హాస్టల్ లో ఒక రాత్రి బస కార్యక్రమంలో భాగంగా కమలాపూర్ లోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలకు కలెక్టర్ రాగా ఎన్సిసి విద్యార్థినులు, బ్యాండ్ బృందం ఘనంగా స్వాగతం పలికారు.
తరగతి గదులు, బాలికల డార్మెట్రీ, కిచెన్, స్టోర్ రూమ్, పాఠశాల పరిసరాలను తిరిగి కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు.
అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ కమలాపూర్ లోని ఎంజేపీ లో విద్యార్థినులతో కలిసి రాత్రి బస చేసేందుకు వచ్చినట్లు తెలిపారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థినులతో మాట్లాడి రాత్రి నిద్ర చేయనున్నట్లు తెలిపారు. ఉదయం విద్యార్థినులతో కలిసి వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
పాఠశాలలోని డార్మెట్రీ లో విద్యార్థినులు, ఉపాధ్యాయినీలతో కలిసి కలెక్టర్ రాత్రి బస చేశారు.
ఈ కార్యక్రమంలో డిఇఓ వాసంతి, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, ఎంజెపి ఆర్సివో రాజ్ కుమార్, ప్రిన్సిపల్ సౌజన్య, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: