ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఎయిడ్స్ సోకిన చదువుకున్న పిల్లలకి నైపుణ్య శిక్షణ ఇప్పించాలని ఈ శిక్షణ ద్వారా వారికి జీవనోపాధి దొరుకుతుంది అని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశం మందిరం లో జరిగిన జిల్లా ఎయిడ్స్ నిర్మూలన మరియు నియంత్రణ కమిటీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ సెక్స్ వర్కర్లకు మరియు ఎయిడ్స్ బాధితులకు అందిస్తున్న డ్రై రేషన్ పంపిణీ చేస్తున్న తరుణంలో రవాణా చార్జీల సమస్య ని పరిష్కరించారు. ప్రభుత్వ టీ.బి ఆస్పత్రులలో సంపూర్ణ సురక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అలాగే సామాజిక భద్రత పథకం ద్వారా వారికి కుట్టు మిషిన్లు అందజేయడం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ హెచ్.ఐ.వి పరీక్షలు ,మరియు వైద్యం పై ప్రతి మూడు నెలల ప్రగతి ని సమీక్షించి , బాధితులకు అన్ని రకాల సహాయం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి.ఎం.హెచ్.ఓ డా. సాంబ శివ రావు , ఎయిడ్స్ అదనపు డి.ఎం.హెచ్.ఓ డా.మధన్ మోహన్ , టీ.బీ నియంత్రణ అధికారి డా.హిమ బిందు , జిల్లా సంక్షేమ అధికారి మధురిమ , సంబంధిత అధికారులు మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Post A Comment: