మద్యం మత్తులో బావమరిది బావ గొంతు కోశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేటలోని మెంగారంలో జరిగింది. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బోనాల్ గ్రామానికి చెందిన నీల స్వామి, అతని బావమరిది నవీన్, సుధాకర్లు మద్యం తాగారు. మద్యం మత్తులో మాటా మాటా పెరగడంతో నవీన్, సుధాకర్ నీలస్వామిపై కత్తితో దాడి చేసి గొంతు కోశారు. వారి నుంచి తప్పించుకున్న నీలాస్వామి గ్రామంలోకి చేరుకోగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: