మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని.. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని.. తెలంగాణ మంత్రిగా తన కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గానీ పక్షపాతం గానీ లేకుండా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ప్రమాణం చేశారు.
Post A Comment: