ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 40 డివిజన్ ఉర్సులోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో డిజిటల్ విద్యలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్ మరియు టీవీని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ సర్కారు విద్య,వైద్యానికి మొదటి ప్రాధాన్యం కల్పిస్తున్నదని డిజిటల్ విద్య ద్వారా విద్యార్థులకు మరింత బాగా అర్థమయ్యే విధంగా బోధన చేయవచ్చునని ఎమ్మెల్యే అన్నారు.
పాఠశాల అభివృద్ధికి తాను ఏళ్ళవేళలా సహాయ సహకారాలు అందిస్తానని అధ్యాపకుల కొరత ఉందని శ్రీ వేంకటేశ్వర ఉన్నత పాఠశాల ప్రెసిడెంట్ కార్పొరేటర్ మరుపల్ల రవి గారు మా దృష్టికి తీసుకొని రావడం జరిగిందని అతి త్వరలో ఆ సమస్య పరిష్కారం దిశగా చూస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర ఉన్నత పాఠశాల ప్రెసిడెంట్ కార్పొరేటర్ మరుపల్ల రవి కార్యదర్శి ఏరా కోటేశ్వర్ ప్రిన్సిపల్ చిట్యాల సోమశేఖర్,సదానందం నాగేశ్వరరావు,యాదగిరి,వనం కుమార్,చంద్రకళ,రజిత గౌతమ్,రాజు,గౌడ శ్రీను నర్సింహ రాజు తదతరులు ఉన్నారు.


Post A Comment: