ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల కార్యాచరణలలో భాగంగా, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, వరంగల్ కార్యదర్శి జాబిషెట్టి.ఉపేందర్ రావు 8న మంగళవారం వడ్డేపల్లి లోని సహృదయ అనాధ వృధ్ధాశ్రమంలో "న్యాయ విజ్ఞాన సదస్సు" ను నిర్వహించారు.
ఈ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ "ప్రతి ఒక్కరికి చట్టాలపై మరియు వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన ఖచ్చితంగా ఉండాలని తెలియజేశారు. వృద్ధులకు, సరైన ఆరోగ్య, ఆహార, భద్రత, పోషణ అందించడం అనేది నిర్వాహకుల యొక్క ముఖ్యమైన కర్తవ్యం అని గుర్తు చేశారు. వృద్ధుల ఆరోగ్య మరియు వ్యక్తిగత సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆశ్రమం లోని వృద్ధుల వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులకు సక్రమంగా పెన్షన్లు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న అనాథ వృద్ధులకు పండ్లను అందించారు. ఈ యొక్క కార్యక్రమం లో సహృదయ అనాధ వృధ్ధాశ్రమం సంస్థ నిర్వాహకులు యాఖూభీ పాల్గొన్నారు.P

Post A Comment: